
శాయంపేట, వెలుగు: గవర్నమెంట్ స్కూల్స్, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు సరైన సమయంలో భోజనం, పండ్లు, కూరగాయలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటివారినైనా క్షమించేదిలేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్కస్తూర్భాగాంధీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. స్కూల్లో కోడిగుడ్లు అందించకపోవడం, పాడైన అరటి పండ్లు అందించిన కాంట్రాక్టర్‌పై కలెక్టర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. స్కూల్లో కోతుల బెడద ఉందని విద్యార్థులు చెప్పడంతో సోలార్‌ఫెన్సింగ్, ఇతర సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు.