ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

 ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం వెలిచాలలో నిర్మాణం పూర్తైన ఎగుర్ల బీరయ్య ఇందిరమ్మ ఇంటిని కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో గురువారం ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీరయ్య ఇంటిని దసరా రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు జవ్వాజి హరీశ్, వీర్ల నర్సింగరావు, గోపాల్​రావుపేట ఏఎంసీ వైస్​ చైర్మన్​ సత్యం, మాజీ సర్పంచ్​ శంకర్, లీడర్లు కృష్ణ, బాబు, కనకయ్య, శంకర్, హనుమంతు, లక్ష్మణ్ పాల్గొన్నారు.

కొండగట్టులో ఎమ్మెల్యే  శమీ పూజ

కొండగట్టు,వెలుగు: కొండగట్టు అంజన్న సన్నిధిలో దసరా సందర్భంగా గురువారం ఆలయ అర్చకులు అధికారులు శమీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శావ కార్యక్రమంలో దేవుని పల్లకిని మోసి జమ్మి చెట్టు వద్ద  శమీ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో శ్రీకాంత్ రావు, ప్రధాన అర్చకుడు రామకృష్ణ, జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి స్థానాచార్యులు కపిందర్, లీడర్లు శ్రీనివాస్, శంకర్, కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.