
- రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థుల గెలుపుకోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్సూచించారు. ఆదివారం స్థానిక ఆఫీస్లో అంతర్గాం మండల ముఖ్యనాయకులు, గ్రామశాఖ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు.
కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అంతకుముందు రామగుండం మాజీ ఎంపీపీ రాజలింగయ్య ఆధ్వర్యంలో పొట్యాల మాజీ సర్పంచ్ వేల్పుల సమ్మయ్య, బీఆర్ఎస్నాయకులు ఆర్ముల మల్లేశ్, గుమ్ముల తిరుపతి, గోలివాడ రాజేశ్, బోరే శ్రీకాంత్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరినవారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు.
సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనుల పరిశీలన..
గోదావరినది బ్రిడ్జి సమీపంలో నెలకొల్పిన సమ్మక్క, సారలమ్మ గద్దెలను పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పరిశీలించారు. గోదావరి నది ఒడ్డున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు.