
నార్కట్పల్లి, వెలుగు : తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. గురువారం నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల, ఔరవాణి గ్రామాల్లో ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి, నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభ్వుతం నల్గొండ జిల్లాలో శివన్నగూడెం, బ్రాహ్మణవెల్లంల, డిండి, నక్కలగండి, పిలాయిపల్లి, ధర్మారెడ్డి నీళ్లు వచ్చే ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మరథం పడతారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు భతుల ఉషయ్య గౌడ్, నాయకులు పబ్బత్తిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వడ్డె భూపాల్ రెడ్డి, ధర్మయ్య, శశిధర్ రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, పుల్లెంల అచ్చాలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరికలు
కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై హస్తం పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం కట్టంగూర్ మండలం గంగదేవిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరగా, వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.