అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం .. పైరవీలకు తావులేదు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం .. పైరవీలకు తావులేదు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం

చెన్నూర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పైరవీలకు తావు లేకుండా అన్ని అర్హతలు ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రొయ్యలపల్లికి చెందిన రవీందర్ ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు లేదని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకారమన్నారు. ఈ మేరకు బాధితుడు రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎమ్మెల్యే వివేక్ గురువారం ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

అతనికి మెరుగైన ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ‘‘అర్హులైనవారికి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. లిస్టులో ఉన్న పేర్లను ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నిజమైన అర్హులకు మంజూరు చేస్తాం. కొంతమంది కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారు. వారి మాటలను నమ్మొద్దు. తప్పుడు ప్రచారం చేసినవాళ్లను సహించేది లేదు. అర్హులైనవారికి ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగకుండా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. ఇలా ఆత్మహత్యాయత్నం చేయడం సరికాదు’’ అని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.