- అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ లీడర్లను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ
కోల్‌బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామని చెన్నూర్ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. శనివారం మందమర్రి ప్రాంతంలో నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న మందమర్రి మండలం సారంగపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కమల మనోహర్, జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సోషల్‌మీడియా కో ఆర్డినేటర్కాజీపేట సతీశ్ కుమార్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ హైదరాబాద్‌లోని నిమ్స్ డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి సతీశ్‌కు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని కోరారు. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు.
పోచమ్మ ఆలయంలో పూజలు
మందమర్రి మున్సిపాలిటీ వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 18 వార్డులోని గాంధీనగర్ పోచమ్మ తల్లి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ లీడర్లతో కలిసి పూజలు చేశారు.
మందమర్రిలో పర్యటించిన వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణను స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మందమర్రి తహసీల్దార్ సతీశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సీఐ శశిధర్‌రెడ్డి పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.