LittleHearts: ‘చదువు రానోళ్ళు’ టీచర్స్ డే నాడు వస్తోన్నారు.. అంచనాలు పెంచిన టీజర్ & ట్రైలర్

LittleHearts: ‘చదువు రానోళ్ళు’ టీచర్స్ డే నాడు వస్తోన్నారు.. అంచనాలు పెంచిన టీజర్ & ట్రైలర్

‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాడ్ రూపొందించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై ఆదిత్య హాసన్, సాయి కృష్ణ నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో సినిమా చూడటానికి యూత్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషన్స్ చేస్తూ, కొత్త ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ఆకర్షిస్తున్నారు. ఇవాళ ఓ కొత్త ప్రోమోతో, ఇంట్రెస్టింగ్ ట్యాగ్తో మరోసారి ఆసక్తి కలిగించారు. 'చదువు రానోళ్ళు టీచర్స్ డే నాడు వస్తోన్నారు... థియేటర్లో కలవండి. ఇంకో 4 రోజుల్లో మీ ముందు ఈ క్రేజీ లిటిల్ హార్ట్స్’ అని మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. 

టీజర్ & ట్రైలర్ విషయానికి వస్తే.. 

‘లిటిల్ హార్ట్స్’ టీజర్, ట్రైలర్.. ఈ రెండునూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేలా సాగాయి. ముఖ్యంగా మౌళి, శివానీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటోంది. కాలేజ్ లైఫ్, కుర్రాళ్ల తుంటరి పనులు, అమ్మాయిల వెనక తిరగడం, ఎమ్‌సెట్ ప్రిపరేషన్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

ALSO READ : Jr NTR: 'డ్రాగన్' లో రుక్మిణి వసంత్..

నటీనటుల క్యారెక్టరైజేషన్స్, పెర్ఫార్మెన్స్‌‌లతోపాటు నవ్వించే  డైలాగ్స్ హైలైట్‌‌గా నిలిచాయి. అయితే, ఓటీటీ సంస్థ ఒరిజినల్ సినిమాగా తెరకెక్కి, ఆ ఓటీటీలో కాకుండా, ముందుగా థియేటర్లలో విడుదల అవుతుండటం విశేషం. 
 
మూవీ కథ విషయానికి వస్తే:

జియో సిమ్ రాకముందు జరిగే కథ ఇది. సైనిక్ పురిలో ఉండే అఖిల్ (మౌళి తనూజ్) చదువురాని ఇంటర్ విద్యార్థి. కొడుకు పనులతో తండ్రి (రాజీవ్ కనకాల) విసిగిపోతాడు. నీ మీద ఖర్చు పెట్టే ప్రతీది నాకు వృథానే అంటాడు. నాన్న తిట్లు అఖిల్ మీద ఏమాత్రం పనిచేయవు.

ఇక వాయుపురిలో ఉండే కాత్యాయని (శివానీ నాగరం) చదువులో వెనకబడటంలో అఖిల్ కంటే ముందుంటుంది. అఖిల్ సరదా మాటలు కాత్యాయనికి నచ్చితే, కాత్యాయనిని చూడగానే లవ్‌‌లో పడిపోతాడు అఖిల్. ఈ ఇద్దరు చదువురాని వాళ్లు ప్రేమించుకుంటారు.

ఈ క్రమంలో కాత్యాయని తప్ప నాకు మరే అమ్మాయి వద్దు అనుకుంటాడు అఖిల్. వీళ్ల సరదా లవ్ స్టోరీలో కాత్యాయని ఫ్యామిలీ బెంగళూరు షిఫ్ట్ అయ్యేందుకు రెడీ అవడం ఇందులో ప్రధాన ట్విస్ట్. అలా అఖిల్, కాత్యాయని ఒక్కటయ్యారా లేదా అనేది మూవీ మెయిన్ కథ అని టీజర్, ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది.