వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడే:సీబీఐ

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడే:సీబీఐ

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని 8 వ నిందితుడిగా చేర్చిన సీబీఐ కోర్టుకు నివేదించింది.  కేసు విచారణను తప్పుదారి పట్టించేందుకు అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి కుట్ర పన్నారని నివేదికను కోర్టుకు సమర్పించింది.  సాక్ష్యాల చెరిపివేతలో వారిద్దరి పాత్ర ఉందని వెల్లడించింది.  భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈనెల 5న కౌంటర్‌ దాఖలు చేసింది సీబీఐ. అందులో పలు కీలక అంశాలు ప్రస్తావించింది సీబీఐ.  వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వెనక కుట్రపై దర్యాప్తు సాగుతోందని తెలిపింది. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ హత్యాస్థలికి వెళ్లారని పేర్కొంది.