బెంగళూరులో ధోనీ క్రికెట్ అకాడమీ ప్రారంభం

V6 Velugu Posted on Oct 13, 2021

బెంగళూరులో MS​ ధోనీ స్టోర్ట్స్ అకాడమీ ప్రారంభమైంది. క్రీడా సంస్థలు గేమ్​ ప్లే, ఆర్కా స్పోర్ట్స్  సంస్థలు సంయుక్తంగా ఈ అకాడమీ ఏర్పాటు చేశాయి. నవంబర్ 7 నుంచి ఈ అకాడమీలో శిక్షణ ప్రారంభించనున్నారు. ఈ అకాడమీలో క్రీడాకారులకు కావాల్సిన సకల సౌకర్యాలూ ఉన్నాయి.

బిదరహళ్లి లో ఈ క్రికెట్  అకాడమీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిర్వాహకులు. నవంబర్​ 7 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. అకాడమీలో చేరేందుకు ఆసక్తి చూపేవారి కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు చెప్పారు.

ఐపీఎల్ 2021 కోసం యూఏఈ లో ఉన్న ధోని..అకాడమీ ప్రారంభం సందర్భంగా యువ క్రికెటర్లకు మెసేజ్ పంపించాడు. యువక్రికెటర్లకు 360 డిగ్రీలలో ట్రైనింగ్ ఇప్పించడమే కాకుండా..మంచి టెక్నిక్స్,టెక్నాలజీతో మీ నైపుణ్యాలను మెరుగులు దిద్దడమే మా ప్రధాన ఉద్దేశం అని అన్నాడు. వెంటనే రిజిస్టర్ చేసుకుని మా అకాడమీలో భాగస్వాములు కావాలన్నాడు.

Tagged MS Dhoni, Bengaluru, Cricket Academy, opens

Latest Videos

Subscribe Now

More News