ఒకప్పుడు లక్షల జీతం, ఇప్పుడు రోజుకు రూ.540: మాజీ ఎంపీ ప్రజ్వల్ జైలు జీవితం ఇదే..

ఒకప్పుడు లక్షల జీతం, ఇప్పుడు రోజుకు రూ.540: మాజీ ఎంపీ ప్రజ్వల్ జైలు జీవితం ఇదే..

గత సంవత్సరం ఏప్రిల్ వరకు ఎంపీగా ఉన్నప్పుడు ప్రజ్వల్ రేవణ్ణకు నెలకు రూ. 1.2 లక్షల జీతంతో పాటు ఇతర అలవెన్సులు వచ్చేవి. కానీ ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉంటూ రోజుకు రూ. 540 మాత్రమే సంపాదిస్తున్నారు. ఎనిమిది గంటల షిఫ్టులు, వారానికి ఆరు రోజులు పనికి  ఇచ్చే జీతం ఇదే.

 జైలు నిబంధనల ప్రకారం ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజుల్లో  ఖైదీలు పని చేసి డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ప్రజ్వల్‌ రేవణ్ణకు  ఇంకా ఎలాంటి పని కేటాయించలేదని జైలు అధికారులు చెబుతున్నారు. కొత్తగా వచ్చిన ఖైదీలకు సాధారణంగా బేకరీలో ఏదైన పని చేయడం లేదా బట్టలు కుట్టడం వంటి పనులు చేపిస్తారు. ఒక సంవత్సరం తర్వాత వారి పనితనం బట్టి  పనులు కల్పించవచ్చు. 

హసన్ మాజీ లోక్‌సభ సభ్యుడైన ప్రజ్వల్  రేవణ్ణని శుక్రవారం ఖైదీల బ్యారక్‌కు మార్చారు, కాబట్టి సోమవారం వరకు అతనికి ఏదైన పనిని ఎంచుకోనికి టైం ఉంటుంది. అలాగే ప్రతి సోమవారం కొత్త ఖైదీలకు పనులు కేటాయిస్తారు. ఇక్కడ ఏ పని అయినా సరే ప్రతినెల జీతం రూ. 540 ఉంటుంది. కఠిన జైలు శిక్ష పడిన ఏ ఖైదీ అయినా జైలు నియమాల ప్రకారం తప్పకుండా పని చేయాల్సి ఉంటుంది  అని ఒక పోలీస్ అధికారి చెప్పారు.

ఏదైన ఆరోగ్య కారణాల వల్ల మినహాయింపు కల్పిస్తే ఉంటే తప్ప ఖైదీలు అందరు ఉదయం 6:30 గంటలకు లేవాలి తర్వాత టిఫిన్ ఇస్తారు. వారం మొత్తంలో ఒకోరోజు ఒక్కో టిఫిన్ మెనూ ఉంటుంది. ఆదివారం వెజిటబుల్ పులావ్, సోమవారం టమాటా బాత్, మంగళవారం చిత్రాన్నం, బుధవారం పోహా, గురువారం పులిహోర, శుక్రవారం ఉప్మా, శనివారం వంగీబాత్ పెడతారు. 

ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య  మధ్యన భోజనం పెడతారు,  ఖైదీలందరూ సాయంత్రం 6:30 గంటలలోగ   బ్యారక్‌లకు తిరిగి వెళ్లాలి. మధ్యన భోజనం ఇంకా  రాత్రి భోజనంలో చపాతీలు, రాగి సంగటి, సాంబార్, తెల్ల అన్నం, మజ్జిగ ఉంటాయి. ఖైదీలకు ప్రతి మంగళవారం  గుడ్డు, ప్రతి నెలా మొదటి, మూడో శుక్రవారం మటన్, రెండో ఇంకా నాలుగో శనివారం చికెన్ పెడతారు. ప్రజ్వల్ రేవణ్ణ కూడా ఇతర ఖైదీలలాగానే వారానికి రెండుసార్లు ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, అది కూడా ఒక్కో కాల్ 10 నిమిషాలు మాత్రమే. జైలు నియమాల ప్రకారం వారానికి ఒకసారి కుటుంబం లేదా స్నేహితులను కలవవచ్చు.

రాష్ట్రంలో ఎనిమిది సెంట్రల్ జైళ్లు, చాల జిల్లా జైళ్లలో దాదాపు 14,500 మంది ఖైదీలు ఉన్నారు. అయితే వారిలో సుమారు 15% మందికి మాత్రమే ప్రస్తుత నిబంధనల ప్రకారం పని కేటాయించవచ్చు. ప్రజ్వల్ రేవణ్ణకి  ఎలాంటి పని కేటాయించలేదు. కానీ ఇప్పటికే పని చేస్తున్న వేల మంది ఖైదీలకు ఏడాది కాలంగా జీతాలు అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 మందికి పైగా ఖైదీలు వేర్వేరు  పనులు చేస్తున్నారు.  కానీ వారి జీతాలు దాదాపు రూ. 3 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే విడుదల అవుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది అని జైలు అధికారి చెబుతున్నారు.