బడ్జెట్లో ఛార్జింగ్ రిసీవర్ ట్యాగ్

బడ్జెట్లో ఛార్జింగ్ రిసీవర్ ట్యాగ్

ఈ మధ్య వస్తున్న ఫ్లాగ్​షిప్​ ఫోన్లు అన్నింటిలో వైర్​లెస్​ ఛార్జింగ్​ ఫీచర్​ ఉంటోంది. కానీ.. బడ్జెట్​ మొబైల్స్​ని వైర్​తోనే ఛార్జ్​ చేయాలి. అందుకే మై అడిక్షన్​ అనే కంపెనీ బడ్జెట్​ ఫోన్లలో వైర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కోసం ప్రత్యేకంగా యూనివర్సల్ వైర్ ‌లెస్ ఛార్జింగ్ రిసీవర్ ట్యాగ్​ని తెచ్చింది. ఇది టైప్​–సి  పోర్ట్​తో వచ్చే అన్ని రకాల ఆండ్రాయిడ్​ ఫోన్లకు సరిపోతుంది. దీన్ని ఇన్​స్టాల్​ చేయడం చాలా ఈజీ. క్రెడిట్​ కార్డు కంటే చిన్న సైజులో ఉండే ఈ అడాప్టర్​కి ఉండే టైప్​–సి పిన్​ని మొబైల్​ పోర్ట్​లో పెట్టాలి. అడాప్టర్​ని మొబైల్​ వెనక అతికిస్తే సరిపోతుంది. తర్వాత వైర్ ‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ‌పై పెడితే ఛార్జ్​ అవుతుంది.     

ధర: 700 రూపాయలు