ఎమ్మెల్యే గన్ లైసెన్స్ రద్దు చేయాలి: నాగం జనార్దన్ రెడ్డి

ఎమ్మెల్యే గన్  లైసెన్స్  రద్దు చేయాలి: నాగం జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గన్  లైసెన్స్  రద్దు చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని తన ఇంటిలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను కాల్చి పారేస్తానన్న ఎమ్మెల్యేపై ఫైర్​ అయ్యారు. ఓడిపోతాననే ప్రస్టేషన్​లో ఇలా మాట్లాడారని పేర్కొన్నారు. ఎర్రమట్టి గుట్టలు, నల్లమట్టి, ఇసుక, ల్యాండ్  మాఫియా చేసి అక్రమంగా సంపాదించడంతో అహంకారం పెరిగిందన్నారు. 

వీటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి వ్యాపారులు కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. 13,500 టీచర్  పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్  దేశం విడిచి పోతాడని ఎద్దేవా చేశారు. అప్పులు చేసి, లూటీ చేసిన డబ్బుతో విర్రవీగుతున్నారని విమర్శించారు. ఎంపీగా ఓడిపోయిన కవితకు ఎమ్మెల్సీ ఇచ్చారని, ఖాళీగా ఉంచకుండా ఉద్యోగం ఇచ్చారన్నారు. తనకు టికెట్  రాకుండా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. అంతకుముందు నాగర్ కర్నూల్  నియోజకవర్గ బూత్​లెవల్  కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నాగం శశిధర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, పాండు, బాలగౌడ్, లక్ష్మయ్య పాల్గొన్నారు.