
హాలియా, వెలుగు : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం నుంచి 63,900 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. దీంతో సాగర్ గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులు (312.040 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు 555. 10 అడుగులు (218. 9876 టీఎంసీలు) మేర నీరు చేరింది. సాగర్ నుంచి హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఏఎమ్మార్పీకి 1,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.