నాగర్ కర్నూల్ మండలంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం 

నాగర్ కర్నూల్ మండలంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ మండలం గగలపల్లి కాటన్ మిల్లు వద్ద సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కష్టానికి తగిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. 

పత్తిని దళారులకు విక్రయించకుండా సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చి సరైన మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంవో స్వరాజ్ సింగ్, సీపీవో రోషన్ దూబే, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, వైస్ చైర్మన్ జంగయ్య, రవికుమార్ పాల్గొన్నారు.