మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద మోడల్ సోలార్ విలేజ్‌గా జిల్లాలోని మరికల్ ఎంపికైనట్లు నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించారు. మరికల్ ను మోడల్ విలేజ్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్గదర్శకాలకు అనుగుణంగా మరికల్ ను ఎంపిక చేశామని, పూర్తి సౌరశక్తి గ్రామంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
డీపీఆర్ ను తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డీపీఆర్ ఆమోదం పొందిన ఏడాదిలోగా ప్రాజెక్టును అమలు చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, ఎల్డీఎం విజయ్ కుమార్, రెడ్ కో డీఎం మనోహర్ రెడ్డి, ట్రాన్స్ కో డీఈ నరసింహారెడ్డి, డీపీవో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి..
కోస్గి: క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే నయం చేసుకోవచ్చని, క్యాన్సర్ స్ర్కీనింగ్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బసవతారకం
క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం కోస్గి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు.
శిబిరంలో 326 మంది పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని మాడల్ క్రష్‌ను కలెక్టర్ ప్రారంభించారు. దీంతో వర్కింగ్ ఉమెన్స్ పిల్లలు, ఆసుపత్రికి వచ్చే రోగుల పిల్లలకు సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్, డాక్టర్లు మల్లికార్జున్, అనుదీప్, తహసీల్దార్ బి. శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఎంపీడీవో శ్రీధర్ ఉన్నారు.
