వివాదంలో నరోత్తమ్ మిశ్రా.. హేమామాలినిపై కీలక వ్యాఖ్యలు

 వివాదంలో నరోత్తమ్ మిశ్రా..    హేమామాలినిపై కీలక వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా  వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..  దాతియాలో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ..  బీజేపీ ఎంపీ  హేమా మాలిని పేరును ఉపయోగించి కామెంట్స్ చేశారు.  దాతియాలో  అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందంటే..  కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు. హేమమాలినితో డ్యాన్స్ కూడా వేయించేంత అభివృద్ధి సాధించాం అన్నారు.  

మిశ్రా  మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ గా మారింది. దీంతో మిశ్రాపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.  సొంత పార్టీ ఎంపీపై  ఇలా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శిస్తున్నాయి.  కాగా మధ్యప్రదేశ్‌లో త్వరలో  జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నరోత్తమ్ మిశ్రా నాల్గవసారి దతియా నుంచి పోటీ చేస్తున్నారు. మిశ్రా 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాతియా నుంచి గెలిచారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాజేంద్ర భారతిని కాంగ్రెస్ బరిలోకి దింపింది.

కాగా మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.