కొత్త చరిత్ర.. ఆసియా గేమ్స్​లో ఇండియా బెస్ట్​ పెర్ఫామెన్స్​

కొత్త చరిత్ర..  ఆసియా గేమ్స్​లో  ఇండియా బెస్ట్​ పెర్ఫామెన్స్​

ఆసియా గేమ్స్​లో  ఇండియా బెస్ట్​ పెర్ఫామెన్స్​

ఇప్పటికే 81మెడల్స్​ కైవసం  2018లో 70 పతకాలే టాప్​

గోల్డ్​ తెచ్చిన నీరజ్ చోప్రా​, జ్యోతి సురేఖ, మెన్స్ రిలే టీమ్


హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌‌‌‌లో ఇండి యన్స్​ పతకాలతో పాటు రికార్డుల మోత మోగిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ గోల్డెన్‌‌‌‌ బాయ్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా, జ్యోతి సురేఖ జోడీ, మెన్స్‌‌‌‌ రిలే టీమ్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌తో మెరిసిన వేళ ఇండియా ఇప్పటికే 81 పతకాలతో (18 గోల్డ్‌‌‌‌, 31 సిల్వర్‌‌‌‌, 32 బ్రాంజ్‌‌‌‌) ఏషియాడ్‌‌లో బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసింది. గత ఎడిషన్‌‌ (జకర్తా)లో సాధించిన 70 పతకాల రికార్డును అధిగమించింది. 

బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోలో నీరజ్‌‌‌‌ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. టెక్నికల్ తప్పిదం వల్ల నీరజ్‌‌‌‌ తొలి ప్రయత్నం నమోదు కాలేదు. కానీ నాలుగో అటెంప్ట్‌‌‌‌లో సీజన్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ త్రోతో గోల్డ్‌‌‌‌ రాబట్టాడు. ఇండియాకే చెందిన జెనా కిశోర్‌‌‌‌ కుమార్‌‌‌‌ 87.54 మీటర్ల దూరంతో సిల్వర్‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. కిశోర్‌‌‌‌ కూడా నాలుగో ప్రయత్నంలోనే మెడల్‌‌‌‌ రాబట్టడం విశేషం. మెన్స్‌‌‌‌ 4x400 మీటర్ల రిలేలో అనాస్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ యాహియా–అమోజ్‌‌‌‌ జాకబ్‌‌‌‌–మహ్మద్‌‌‌‌ అజ్మల్‌‌‌‌–రాజేశ్‌‌‌‌ రమేశ్‌‌‌‌ బృందం 3:01.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 

విమెన్స్‌‌‌‌ 4x400 మీటర్లలో విత్య రామరాజ్‌‌‌‌–ఐశ్వర్య మిశ్రా–ప్రాచీ–సుభా వెంకటేశన్‌‌‌‌ బృందం 3:27.85 సెకన్లలో టార్గెట్‌‌‌‌ను ఫినిష్‌‌‌‌ చేసి రెండో ప్లేస్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ సాధించింది. 5వేల మీటర్ల పరుగులో లాంగ్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ రన్నర్‌‌‌‌ అవినాశ్‌‌‌‌ సాబ్లే 13:21.09 సెకన్లతో సిల్వర్‌‌‌‌ గెలిచాడు. విమెన్స్‌‌‌‌ 800 మీటర్ల రన్‌‌‌‌లో హర్మిలన్‌‌‌‌ 2:03.90 సెకన్లతో సిల్వర్‌‌‌‌ సొంతం చేసుకుంది. 35 కి.మీ రేస్‌‌‌‌ వాక్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌లో మంజు రాణి–రాంబాబు 5 గం.51ని.14 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ సంపాదించారు.

లవ్లీనా సిల్వర్‌‌‌‌ పంచ్‌‌‌‌

గోల్డ్​పై ఆశలు రేపిన స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ లవ్లీనా బొర్గోహైన్‌‌‌‌ తుది మెట్టుపై తడబడింది. 75 కేజీల ఫైనల్లో లవ్లీనా 0-–5తో లి క్వియాన్‌‌‌‌ (చైనా) చేతిలో ఓడి సిల్వర్‌‌‌‌తో సరిపెట్టుకుంది. డిఫెన్సివ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ లవ్లీనా గోల్డ్‌‌‌‌ ఆశలను ఆవిరి చేసింది. చైనీస్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ కొట్టిన ఔట్‌‌‌‌ పంచ్‌‌‌‌లకు ఇండియన్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ జవాబు చెప్పలేకపోయింది. విమెన్స్‌‌‌‌ 57 కేజీల సెమీస్‌‌‌‌లో పర్వీన్‌‌‌‌ హుడా 0-–5తో లిన్‌‌‌‌ యు టింగ్‌‌‌‌ (చైనీస్‌‌‌‌తైపీ) చేతిలో ఓడి బ్రాంజ్‌‌‌‌కు పరిమితమైంది. ఓవరాల్‌‌‌‌గా ఇండియా బాక్సర్లు 5 మెడల్స్‌‌‌‌ (1 సిల్వర్‌‌‌‌, 4 బ్రాంజ్‌‌‌‌)తో గేమ్స్‌‌‌‌ను ముగించారు. 

కాంపౌండ్‌‌‌‌ మిక్స్​డ్​ టీమ్​కు తొలి గోల్డ్‌‌‌‌

ఆర్చరీ కాంపౌండ్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో ఇండియన్స్ తొలిసారి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిశారు. ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజాస్‌‌‌‌ దియోతలే జోడీ 159–158తో రెండోసీడ్‌‌‌‌ సో చావోన్‌‌‌‌–జూ జియోహున్‌‌‌‌ (కొరియా)పై గెలిచింది. హోరాహోరీగా సాగిన టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో దియోతలే  ఒక పాయింట్‌‌‌‌ చేజార్చుకున్నా.. జ్యోతి ఎనిమిది బాణాలకు పర్ఫెక్ట్‌‌‌‌ టెన్‌‌‌‌ పాయింట్లు సాధించింది. వ్యక్తిగత విభాగాల్లోనూ ఈ ఇద్దరూ ఫైనల్​ చేరి గోల్డ్​ మెడల్​ బరిలో నిలిచారు. కాగా,  రికర్వ్‌‌‌‌ మిక్స్​డ్​ ఈవెంట్​లో అటాను దాస్‌‌‌‌–అంకిత క్వార్టర్‌‌‌‌ఫైనల్లోనే ఓడి ఇంటిదారి పట్టారు.

ఫైనల్లో దీపిక-హరీందర్

స్క్వాష్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో అనాహత్‌‌‌‌ సింగ్‌‌‌‌- ,అభయ్‌‌‌‌ సింగ్‌‌‌‌ కాంస్యంతో సరిపెట్టు కోగా.. దీపిక పల్లికల్-, హరీందర్ సింగ్​ ఫైనల్​ చేరారు. సెమీస్‌‌‌‌లో అనహత్‌‌‌‌-–అభయ్‌‌‌‌ 1–2తో ఐఫా బినిటి– మహ్మద్‌‌‌‌ కమల్‌‌‌‌ (మలేసి యా) చేతిలో ఓడారు. మరో మ్యాచ్‌‌‌‌లో దీపిక-–హరీందర్‌‌‌‌ 2–1తో లీ కా యి-వాంగ్‌‌‌‌– చి హిట్‌‌‌‌ (హాంకాంగ్‌‌‌‌)పై గెలిచారు.

సునీల్ కంచు పట్టు

గ్రీకో రోమన్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌ సునీల్‌‌‌‌ కుమార్‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలుచుకున్నాడు. 87 కేజీల సెమీస్‌‌‌‌ బౌట్‌‌‌‌లో సునీల్‌‌‌‌ 1–5తో అలిజాడెష్‌‌‌‌ నాసెర్‌‌‌‌ (ఐర్లాండ్‌‌‌‌) చేతిలో ఓడి కాంస్యంతో సంతృప్తి పడ్డాడు. గ్రీకో రోమన్‌‌‌‌ కేటగిరీలో 13 ఏళ్ల తర్వాత ఇండియా కు వచ్చిన తొలి మెడల్​ ఇది.

హాకీ ఫైనల్లో ఇండియా

మెన్స్​ హాకీలో ఇండియా ఫైనల్​ చేరింది. సెమీఫైనల్లో 5–3తో సౌత్ కొరియాను ఓడించింది. ఫైనల్లో జపాన్​తో పోటీ పడనుంది. మరోవైపు బ్యాడ్మింటన్​ విమెన్స్​ సింగిల్స్​లో పీవీ సింధు, మెన్స్​లో​ ప్రణయ్​, డబుల్స్​లో సాత్విక్–చిరాగ్​ ప్రిక్వార్టర్స్​లో గెలిచి క్వార్టర్స్​ చేరుకున్నారు.