పబ్లిక్ ప్లేసుల్లో రీల్స్ బ్యాన్ చేయండి : చట్టం కోసం నెటిజన్ల డిమాండ్

పబ్లిక్ ప్లేసుల్లో రీల్స్ బ్యాన్ చేయండి : చట్టం కోసం నెటిజన్ల డిమాండ్

ఈ మధ్య కాలంలో జనాలకు వెర్రి వేషాలు ఎక్కువయ్యాయి..  ఎక్కడున్నామా అని కూడా ఆలోచించడం లేదు.  ఎట్టపడితే అట్ట.. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేయడం.. తోటి వారిని ఇబ్బంది పెట్టడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. రైల్వేస్టేషన్​, బస్​ స్టేషన్​, ట్రైన్స్​ లో యూత్​ తెగ రెచ్చిపోతూ.. అశ్లీల నృత్యాలు చేస్తే నానా రచ్చ చేస్తున్నారు.   పైగా.. ఏదో ఘనకార్యం చేశామని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడం బాగా అలవాటై పోయింది.  

పబ్లిక్​ ప్లేస్​ లో అసభ్యకరంగా ప్రవర్తించడం.. అశ్లీలంగా స్టెప్పులు వేయడం.. రీల్​ డ్యాన్స్​ లు  చేయడం .. లాంటివి చేస్తూ జనాలను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.  ఈ మధ్య కాలంలో ఇలా చేసిన వీడియోలు ఇంటర్నెట్​ లో పోస్ట్​ చేయడంతో  వినియోగదారులు చాలా ఇబ్బందులకు గురవుతన్నామని.... అలాంటి వారిపై చర్యలు తీసుకొనేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  ఇంటర్నెట్​ అనవసర దృశ్యాలు పోస్ట్​ చేస్తూ జనాలను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకొనేందుకు చట్టం తీసుకురావాలని నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు.రైల్వే స్టేషన్‌లోనే కాకుండా  ట్రైన్ ఎక్కి ప్రయాణీకుల మధ్య డ్యాన్స్ చేసేవారిని  నెటిజన్లు బాగా తప్పు పట్టారు.

ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది బహిరంగ ప్రదేశాల్లో  రీల్స్​ చేసి..  ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే వారిని శిక్షించేందుకు ఛాప్రీ వ్యతిరేక చట్టం తీసుకురావాలని X ట్విట్టర్​ లో పోస్ట్​ చేశారు.  బెడ్ రూమ్ లో వేసుకోవాల్సిన డ్రెస్సు వేసుకొని పబ్లిక్ లోకి రావడమే తప్పు అనుకుంటే, అసభ్యకర రీతిలో డ్యాన్స్ చేయడం మరింత తప్పని నెటిజన్లు కామెంట్​ చేశారు. 

పబ్లిక్ ప్లేస్‌ల్లో మర్యాదగా ప్రవర్తించుకోవాలని, అలాంటి కార్యకలాపాలు మరింత సరైన ప్రదేశాల్లో చేయాలని కొందరు కోరారు.ఈ యువతి( young woman ) వీడియోపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా హార్స్ గా ఉన్నాయి.‘రైల్వే స్టేషన్ లేదా మెట్రో ట్రైన్‌లో డ్యాన్స్ చేయడం అవమానకరం, ఈ డ్యాన్స్ మరింత చెత్తగా ఉంది, వైరల్‌గా మారడం కోసం ఇలాంటి పిచ్చి చేష్టలు చేయాల్సిన అవసరం లేదు.’ అని ఇంటర్నెట్ యూజర్లు మండిపడ్డారు.మరికొందరు ఇది తనను బాగా అసౌకర్యానికి గురి చేసిందని కామెంట్ చేశారు.

ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ఇతర నగరాల్లో కూడా ఈ ట్రెండ్ ను చాలా మంది ఫాలో అవుతున్నారు.ఇక్కడ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేసి వైరల్ సెన్సేషన్ గా మారుతున్నారు.ఈ చర్యలపై ప్రజల నుంచి విమర్శలు, ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.వారిపై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను కోరుతున్నారు.అధికారులు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పని చేయొద్దని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.అయినా ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.