పాపం పాకిస్తాన్ జనం..లీటర్ పెట్రోల్ రూ.320..లీటర్ డీజిల్ రూ. 325

పాపం పాకిస్తాన్ జనం..లీటర్ పెట్రోల్ రూ.320..లీటర్ డీజిల్ రూ. 325

ఓ వైపు ఆర్థిక సంక్షోభం..మరోవైపు నిత్యావసర ధరల పెరుగుదలతో  అష్టకష్టాలు పడుతున్న పాక్ ప్రజలపై అక్కడి ప్రభుత్వం మరో భారం మోపింది. పెట్రోల్, హై స్పీడ్ డీజిల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్పై లీటర్ కు  రూ. 10 నుంచి 14 వరకు, హై స్పీడ్ డీజిల్ పై లీటర్ కు  14 నుంచి 16 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు కిరోసిన్ ధరను కూడా లీటర్ కు రూ. 10  పెంచింది పాక్ ప్రభుత్వం. పెంచిన ధరలతో పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 320 కాగా..లీడర్ హై స్పీడ్ డీజిల్ ధర రూ. 325 అయింది. పాకిస్తాన్ ప్రభుత్వం ధరలు పెంచడం ఇది నాల్గో సారి. అంతకుముందు సెప్టెంబర్ 1వ తేదీన పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ పై వరుసగా రూ. 14.91 , రూ. 18.44 చొప్పున పెంచింది. 

సెప్టెంబర్ 1 నుంచి పెట్రోల్ , డీజిల్, కిరోసిన్ ల దిగుమతి ధరలు పెరిగాయని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్ పై రూ. 13, డీజిల్ పై రూ. 14, కిరోసిన్ పై రూ. 10 దిగుమతి ధరలు పెరిగాయని వెల్లడించింది. అందుకే అమ్మకాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. లీటర్ పెట్రోల్ పై రూ. 13, లీటర్ డీజిల్ పై రూ. 16, లీటర్ కిరోసిన్ పై రూ. 10 పెంచుతున్నట్లు తెలిపింది. జెట్ ఇంధనాల ధర కూడా లీటరుకు రూ. 10 వరకు పెరగనుందని పేర్కొంది. ఈ ధరల పెరుగుదలతో పెట్రోల్ లీటరు రూ. 320, డీజిల్ లీటర్  రూ. 325 దాటవచ్చని వెల్లడించింది. కిరోసిన్ లీటర్ రూ. 240 వరకు పలుకుతుందని అంచనా వేసింది. 

Also Read :- 11వేల 300కు చేరుకున్న మృతుల సంఖ్య.. 20వేలకు చేరొచ్చని అంచనా

పాకిస్తాన్ లో ఆగస్టు 16వ తేదీన మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే పెట్రోల్, హై స్పీడ్ డీజిల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ లీటర్ కు రూ. 17.50, హై స్పీడ్  డీజిల్ ధర లీటరుకు రూ. 20 చొప్పున పెంచింది. ఆ తర్వాత మరో 15 రోజుల్లో మరోసారి ధరలను పెంచింది. దీంతో కేవలం 15 రోజుల వ్యవధిలోనే పెట్రోల్ పై లీటరుకు రూ. 31.41, డీజిల్ పై రూ. 38.44 పెరగడం గమనార్హం. ఇప్పటికే కూరగాయలు, ఇతర నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో పాకిస్తాన్ ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వారిపై మరింత భారం కానుంది.