ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే రిలీజ్ చేయండి.. సుప్రీంకోర్టు ఆదేశం

ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే రిలీజ్ చేయండి.. సుప్రీంకోర్టు ఆదేశం

అరెస్ట్ చేసిన మాజీ ప్రధాన మంత్రిని వెంటనే రిలీజ్ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు. నిబంధనలకు విరుద్ధంగా.. ఒంటెద్దు పోకడలతో అదుపులోకి తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ సుప్రీంకోర్టులో మే 11వ తేదీ సుదీర్ఘమైన వాదనలు నడిచాయి.. పాక్ రేంజర్లు కోర్టు లోపలికి వచ్చి.. బలవంతంగా ఎత్తుకెళ్లటంపై మండిపడింది కోర్టు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాక్ దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఈ క్రమంలోనే అత్యున్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుని.. అత్యవసరంగా విచారణ చేపట్టింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉమర్ అక్త్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి.. 5 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనే అభియోగాలపై అవినీతి నిరోధక కోర్టుకు వచ్చారు ఇమ్రాన్ ఖాన్.. ఈ సమయంలోనే.. పాక్ రేంజర్లు కోర్టు లోపలికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని.. గంటలోగా సుప్రీంకోర్టుకు తీసుకురావాలంటూ ఆదేశాలు జారీ చేశారు జడ్జీలు. దీంతో పాక్ ప్రభుత్వం.. ఇమ్రాన్ ఖాన్ ను కోర్టుకు తీసుకొచ్చింది. విచారణ తర్వాత వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.