- దీపావళి సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన జనం
 - తిరిగి సిటీకి వస్తుండగా రోడ్లపై బారులు తీరిన వాహనాలు
 
యాదాద్రి, వెలుగు : దీపావళి పండుగ సెలవులు ముగిశాయి. పల్లెకు వెళ్లిన సిటీవాసులు తిరిగి బాటపట్టారు. ఉద్యోగ, ఉపాధి కోసం సిటీలో ఉంటున్న జనాలు దీపావళి పండుగ వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లారు.
ఆదివారంతో ముగియడంతో  తిరిగి పయణమయ్యారు. దీంతో యాదాద్రి జిల్లాలోని విజయవాడ- – హైదరాబాద్,  వరంగల్– -హైదరాబాద్జాతీయ రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. పంతంగి, గూడూరు టోల్‌ప్లాజాల వద్ద సుమారు అర కిలోమీటరు వరకు వెహికల్స్ బారులు తీరి కనిపించాయి. 
 
