
గోదావరిఖని, వెలుగు: సింగరేణి కాలరీస్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్జీ 1 ఏరియా ఉపాధ్యక్షుడిగా పెంచాల తిరుపతిని నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నాగేశ్వర్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి ప్రస్తుతం జీడీకే 2 ఇంక్లైన్‌లో మైనింగ్ సర్దార్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ సింగరేణి బీసీ ఉద్యోగుల హక్కుల రక్షణ విషయంలో ఎల్లవేళలా ఉద్యోగులకు అందుబాటులో ఉంటానన్నారు. తన నియామకానికి సహకరించిన అధ్యక్షుడు నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఎన్.రమేశ్, స్థానిక లీడర్లకు కృతజ్ఞతలు తెలిపారు.