
- ఖమ్మం స్టూడెంట్కు సర్టిఫికెట్అందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో జాతీయ స్థాయిలో టాపర్ గా నిలిచిన ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన తాళ్లూరు పల్లవి ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా సర్టిఫికెటు అందుకున్నారు.
ఐటీఐ ట్రేడ్ టెస్టులో టాపర్లుగా నిలిచిన 45 మంది విద్యార్థులను శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమారోహ్ కార్యక్రమంలో ప్రధాని మోదీ సత్కరించి సర్టిఫికెట్లు అందజేశారు. వారిలో తెలంహాణ నుంచి పల్లవితో పాటు ఏపీకి చెందిన పి.మధులత (ఆర్ అండ్ ఏసీ టెక్నిషియన్), డి. వందన (పెయింటర్ జనరల్), ఎస్.యామిని వరలక్ష్మి(వుడ్వర్క్ టెక్నిషియన్) ఉన్నారు.