
2025 ప్రారంభం నుంచి సెప్టెంబర్ వరకు అమెరికాలో 9లక్షల46వేల 426 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఇది 2020 తరువాత అత్యధిక స్థాయి. మొత్తం ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య ఏడాది చివరి నాటికి 10 లక్షలు దాటవచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్థిక మందగమనంతో కంపెనీల నియామకాల్లో గణనీయమైన ప్రభావంతో వస్తోంది. సంస్థలు 2025 చివరి వరకు ఉద్యోగ నియామకాల్లో 58% క్షీణతను అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు కొత్త సాంకేతికతల ప్రభావం, ప్రత్యేకంగా ఏఐ ఉద్యోగాల్లో మార్పులు తీసుకురానుందని నిపుణులు భావిస్తున్నారు.
సెప్టెంబర్‌లో ఉద్యోగాల కోల్పోకడం 37% తగ్గిందని క్షీణత సూచిస్తోంది. తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్ సైతం ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితికి కారణంగా మారుతోంది. ఎందుకంటే 7లక్షల 50వేల ఫెడరల్ ఉద్యోగులు తాత్కాలికంగా పని చేయడం ఆపేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్ పెరిగిన వడ్డీ రేట్లను తగ్గిస్తూ మార్కెట్‌ను మద్దతు ఇవ్వాలని చూస్తోంది.
ముఖ్యంగా ఆటోమోటివ్, విమానయాన సంస్థలు వంటి చోట్ల పెద్ద ఎత్తున లేఆఫ్స్ కొనసాగుతున్నాయి అమెరికాలో. AI కారణంగా 37వేల కంటే ఎక్కువ ఉద్యోగాలు నేరుగా కోల్పోయినట్లుగా నివేదించబడింది. మెుత్తానికి అమెరికా జాబ్ మార్కెట్ 2025లో మాంద్యానికి గురవుతోందని చెప్పవచ్చు. భారీ లేఆఫ్స్, నియామకాలకు తగ్గిన డిమాండ్, ఫెడరల్ షట్‌డౌన్ వంటి అంశాలు ఈ పరిస్థితిని మరింత గంభీరతరం చేస్తున్నాయి. అయితే, వడ్డీ రేట్ల తగ్గింపు తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదింపును తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు కొత్త సాంకేతికతలు ఉద్యోగ మార్కెట్‌ను మార్చుతూ ఉండగా, మరొకవైపు ఆర్థిక మాంద్యం వలన రిక్రూట్మెంట్ తగ్గడం మరిన్ని లేఆఫ్ సంకేతాలు ఇస్తున్నాయి.
►ALSO READ | అమెరికాలో కొత్త ట్రెండ్.. టార్గెట్ చేసి భారతీయులను లేఆఫ్.. జూమ్ కాల్స్ పెట్టి నిమిషాల్లోనే..
పైగా మరో కొత్త ట్రెండ్ గమనిస్తే అమెరికాలోని అనేక కంపెనీలు ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా భారతీయ ఉద్యోగులను టార్గెట్ చేసి లేఆఫ్ చేస్తున్నాయి. దీంతో పనితీరుకు సంబంధం లేదని అవి చెబుతూ నిర్థాక్షణ్యంగా వ్యవహరించటం ఆందోళలను పెంచేస్తోంది. దీంతో 2009 అంటే మాంద్యం తర్వాత అమెరికాలో రిక్రూట్మెంట్స్ అత్యల్ప స్థాయిలకు పడిపోయాయని వెల్లడైంది.