'కుళ్ళిన చికెన్, మురికిగా వంటగది': బెంగళూరు KFCలో షాకింగ్ ఘటన..

'కుళ్ళిన చికెన్, మురికిగా వంటగది': బెంగళూరు KFCలో షాకింగ్ ఘటన..

బెంగళూరు HSR లేఅవుట్‌లో ఉన్న KFCలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఫుడ్ ప్రియులను తీవ్రంగా కలవర పెడుతుంది. దింతో ఆహార పరిశుభ్రత గురించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వివరాలు చుస్తే ఓ మహిళ KFCలో హాట్ & స్పైసీ చికెన్ జింజర్ బర్గర్ ఆర్డర్ చేయగా, ఆ చికెన్ నుండి దుర్వాసన వచ్చిందని, చికన్ కుళ్ళిపోయి ఉందని పోస్ట్‌లో వివరించింది.

అంతేకాకూండా ఆ బర్గర్‌లో పాడైపోయి తినడానికి కూడా వీల్లేకుండా ఉందని చెప్పింది. అయితే ఈ విషయాన్ని సిబ్బందికి చెప్పి, వేరే బర్గర్ ఇవ్వమని అడగగా, ఇచ్చిన రెండో బర్గర్ కూడా అలాగే దుర్వాసనతో పాడైపోయి ఉందని ఆశ్చర్యపోయింది.

దీన్ని అక్కడి సిబ్బంది అది సాస్ వాసన మాత్రమే అంటూ ఆమె మాటలను కొట్టిపారేశారు. సరైన చికెన్ బర్గర్ ఇవ్వకుండా వెజ్ బర్గర్ ఇచ్చేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అదే సమయంలో మరొక కస్టమర్ కూడా కొత్త ప్యాటీ అడిగితే, వారికి కూడా కుళ్ళినదే ఇచ్చారని ఆరోపించారు. 

దింతో ఆందోళన చెందిన కస్టమర్లు వంటగది (కిచెన్) చెక్ చేయాలని గట్టిగా అడగ్గా, మేనేజర్ అందుబాటులో లేరని రాత్రి 10 గంటల తర్వాత కస్టమర్లను లోపలికి అనుమతించమని సిబ్బంది చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.  

కస్టమర్ల ఒత్తిడి తర్వాత వంటగదిలోకి వెళ్లి చూడగా అక్కడ అంత మురికిగా, అపరిశుభ్రంగా ఉందని, చికెన్ కోసం ఉపయోగించే బ్రెడ్ వాటర్ కూడా మురికిగా, కలుషితంగా ఉందని చెప్పారు. అలాగే ఆ వంటగది వీడియోను కూడా షేర్ చేసారు. 

అంతేకాకుండా వాడిన వంట నూనెని మళ్ళీ మళ్ళీ  వాడటం వల్ల నూనె నల్లగా మారిపోయిందని, కోల్డ్ స్టోరేజ్లో కూడా దుర్వాసన వస్తుందని, కింద నేలపైన మరకలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేసారు.

దీనికి సంబంధించి పోలీసులకు ఫోన్ చేయగా  దాదాపు అరగంట పాటు వంటగదికి తాళం వేసి ఉంచారని, అయిన కూడా స్విగ్గీ, జొమాటో ద్వారా ఆర్డర్‌లు పంపుతున్నారని తెలిపారు. 

చివరికి కస్టమర్‌లు, పోలీసులు మేనేజర్‌ను నిలదీసి అడగ్గా మేనేజర్ ఈ విషయంని అంగీకరించాడు. ఈ సంఘటన kfc కాకుండా ఇతర ఫాస్ట్ ఫుడ్ చైన్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై తీవ్ర అనుమానాలు పెంచుతోంది. అలాగే దీనికి సంబంధించి పోలీసులు మరింతగా విచారిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.