
జనగామ/ ఏటూరునాగారం/ బచ్చన్నపేట, వెలుగు: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, నర్మెట్ట సీఐ అబ్బయ్య సూచించారు. శుక్రవారం నిర్వహించిన సమావేశాల్లో వారు వేర్వేరుగా మాట్లాడుతూ గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.