వ్యాక్సిన్​ వేయించుకున్నోళ్లకు రాఖీ డిస్కౌంట్

V6 Velugu Posted on Aug 19, 2021

కొవిడ్​కి సరైన మెడిసిన్​ లేక కిందటేడాది ఎంత బాధపడ్డామో అందరికీ తెలిసిందే. అందుకే వ్యాక్సినేషన్​ని గవర్నమెంట్ ఒక మిషన్​లా చేపట్టి, ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సిన్​ ఇస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఫ్రీగా వ్యాక్సిన్  వేస్తున్నారు. అయినా కూడా కొంతమంది అపోహలతో వ్యాక్సిన్​ వేయించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. అయితే ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు గతంలో కొన్ని రంగాల్లో రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా పవన్​ అనే వ్యాపారి కొత్తగా ఆలోచించాడు. వచ్చే ఆదివారం అందరూ ఎంతో సంబురంగా రాఖీ పండుగ జరుపుకుంటారు. కాబట్టి రాఖీ కొనే వాళ్లకు ఒక ఆఫర్​ ఇస్తున్నాడు. వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్​ చూపిస్తే 50% డిస్కౌంట్ ఇస్తానని అనౌన్స్​ చేశాడు. ఇలాగే ఇంకొంతమంది వ్యాపారులు కూడా రాఖీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నారు.

Tagged Vaccine, Fesival, , Rakhi Discount

Latest Videos

Subscribe Now

More News