అమరుల జ్ఞాపకార్థం ఫ్లాగ్ డే నిర్వహిస్తాం

అమరుల జ్ఞాపకార్థం ఫ్లాగ్ డే నిర్వహిస్తాం

జైపూర్, వెలుగు: పోలీస్​అమరుల జ్ఞాపకార్థం ఏటా ఫ్లాగ్​డే నిర్వహిస్తామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. జైపూర్​ మండలం ఇందారంలోని ఓ ఫంక్షన్ హాల్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ లీడర్లు రక్తదానం చేశారు. చట్టాలు, పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 

అనంతరం రక్తదానం చేసిన వారికి సీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో  శ్రీరాంపూర్, చెన్నూరు సీఐలు వేణుచందర్, దేవేందర్, బన్సీలాల్, నరేశ్, ఎస్సైలు  శ్రీధర్, సంతోష్, లక్ష్మీప్రసన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.