
‘క్రాక్’ సక్సెస్ అయ్యాక కెరీర్‌లో స్పీడు పెంచాడు రవితేజ. వరుస ప్రాజెక్టుల్ని లైన్‌లో పెట్టి, వాటిని పూర్తి చేసే పనిలో పడ్డాడు. రమేష్‌వర్మ డైరెక్షన్‌లో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్న రవితేజ, అదింకా సెట్స్‌పై ఉండగానే ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి కొబ్బరికాయ కొట్టాడు. దాంతో ‘ఖిలాడి’ షూట్‌ని ప్రస్తుతానికి ఆపేశాడని, కొత్త సినిమా పూర్తయ్యాకే ఆ చిత్రాన్ని కంప్లీట్ చేస్తాడని గుసగుసలు మొదలయ్యాయి. అవేమీ నిజం కాదంటోంది ‘ఖిలాడి’ టీమ్. ఈ నెల 26 నుంచి కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ప్లే స్మార్ట్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్. జయంతిలాల్ గడ సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మేజర్ పార్ట్ షూట్ పూర్తయింది. సెకెండ్ వేవ్‌కి ముందే ఇటలీలో ఓ భారీ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు మొదలు కానున్న షెడ్యూల్‌లో బ్యాలన్స్ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌ని షూట్ చేయబోతున్నారు. థియేటర్స్‌లో ఆడియెన్స్‌కి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నాడు రమేష్‌వర్మ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అతని తమ్ముడు సాగర్.. శ్రీకాంత్ విస్సాతో కలిసి డైలాగ్స్ రాస్తున్నాడు.