రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడంతా రీఅపాయింట్​మెంట్ల హవా

రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడంతా రీఅపాయింట్​మెంట్ల హవా
  • రిటైర్డ్​ అయిన ఐదుగురు ఐఏఎస్ లకు రెండేండ్ల పాటు సేమ్ పోస్టు
  • 12 మందికి ముఖ్య సలహాదారులు, 
  • సలహాదారుల పోస్టులు    సర్కారు సొమ్ముతో 
  • అన్ని సౌలతులు     అసంతృప్తిలో ఇతర ఐఏఎస్​లు
  • స్పెషల్​ సీఎస్​లుగా రీఅపాయింట్​మెంట్

రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడంతా రీఅపాయింట్​మెంట్ల హవా నడుస్తున్నది. నిరుడు స్పెషల్​ సీఎస్​ హోదాలో రిటైరయిన అధర్​ సిన్హాకు ప్రభుత్వం రెండేళ్ల పాటు పశుసంవర్ధక శాఖ స్పెషల్​ సీఎస్​గా ఆయననే కొనసాగిస్తూ రీఅపాయింట్​ చేసింది. ఆ తరువాత జీఏడీలో ప్రొటోకాల్​ సెక్రటరీగా ఉన్న అర్విందర్​ సింగ్​ను కూడా మళ్లీ అదే పోస్టులో రెండే ళ్ల పాటు నియమించింది. ఇక దేవాదాయ, సివిల్​ సప్లయ్స్​ కమిషనర్​ అనిల్​ కుమార్​ కూడా రిటైర్​ అయ్యాక.. తిరిగి ఆ శాఖలోనే అదే పోస్టులో పున ర్నియమించింది. కార్మిక శాఖ స్పెషల్​ సీఎస్​గా రిటైర్​ అయిన రాణి కుముదినిని మళ్లీ అదే పోస్టు లో నియమించింది. 10 నెలల కింద రిటైర్​ అయిన ఒమర్​ జలీల్​ను కూడా ప్రభుత్వ కార్యదర్శి, మైనారిటీ వెల్ఫే ర్​ కమిషనర్​గా రీఅపాయింట్​ చేసింది. ఏడా దిన్నరలో ఐదుగురిని రీ అపాయింట్​మెంట్​ చేయడంపై విమర్శలు ​వ్యక్తం అవుతున్నాయి.  

సలహాదారులుగా ఇట్లా 

వివిధ పోస్టుల్లో రిటైర్​ అయినవాళ్లు ప్రస్తుతం 12 మంది ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. చీఫ్​ సెక్రటరీగా రిటైర్​ అయిన రాజీవ్​ శర్మ  ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్​ సీఎం చీఫ్​ అడ్వయిజర్​గా ఉన్నారు. సీఎస్​ హోదాలో పదవీ విరమణ పొందిన ఎస్​.కె. జోషి ఇరిగేషన్​ అడ్వయిజర్​గా ఉన్నారు. 2012లో రిటైర్​ అయిన కె.వి.రమణాచారి ప్రభుత్వ అడ్వయిర్ గా కొనసాగుతున్నారు. పీసీసీఎఫ్​ హోదాలో పదవీ విరమణ చేసిన శోభకు అదే రోజున అడ్వయిజర్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ అనురాగ్​ శర్మ, రిటైర్డ్  ఐపీఎస్​ ఏకే ఖాన్​ కూడా సలహాదారులుగా కొనసాగుతున్నారు. సుధాకర్​ తేజ ఆర్​ అండ్​ బీకి, డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్​ సింగ్​ ఎనర్జీ సెక్టార్​కు,  శ్రీనివాస్​రావు హార్టికల్చర్​కు సలహాదారులుగా ఉన్నారు.

కొందరికి అట్లా.. ఇంకొందరికి ఇట్లా

ఆఫీసర్ల విషయంలో రాష్ట్ర సర్కారు​ ఒక్కోలా నిర్ణయం తీసుకుంటున్నది. అనుకూలంగా అనిపించ కపోయినా.. ఆ ఐఏఎస్, ఐపీఎస్​ ఆఫీసర్​ మధ్యలోనే రాజీనామా చేసి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో గతంలో కనిపించాయి. ఇందులో ఆకునూరి మురళి, ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్, వీకే సింగ్​లాంటి వాళ్లున్నారు. గతంలో సీఎస్​గా నియమితులైన రెండు నెలలకే ప్రదీప్​ చంద్ర రిటైర్​ అయ్యారు. సీఎస్​ హోదాలో ఉన్న ఐఏఎస్​లకు ఎక్స్​టెన్షన్​ ఇచ్చిన సర్కారు.. ప్రదీప్​ చంద్ర అనుకూలంగా లేకపోవడంతోనే అలా చేసిందని పెద్ద చర్చ జరిగింది. కొంతమంది సీనియర్​ ఐఏఎస్​లకు లూప్​ పోస్టులు ఇచ్చి, అనుకూలంగా ఉన్నోళ్లకు మంచి డిపార్ట్​మెంట్లను కేటాయిస్తున్నది. రెవెన్యూ ప్రిన్సిపల్​ సెక్రటరీ, సీసీఏల్ఎ, ఇంటర్మీడియెట్​ ఎడ్యుకేషన్ కమిషనర్​గా ఒకే అధికారి,హెచ్ఎండీఏ, ఎమ్ఏయూడీ స్పెషల్​ సీఎస్​, సీడిఎంఏ కమిషనర్​ పోస్టులు ఒక​ అధికారి దగ్గరే ఉన్నాయి. ఇదిలా ఉంటే దాదాపు 8 మంది ఐఏఎస్​ ఆఫీసర్లు పోస్టింగ్​లు లేకుండా ఖాళీగా ఉన్నారు. వారిలో హరిచందన, శైలజా రామయ్యర్, హైమవతి, సత్యశారద, నిఖిల, నవీన్​ నికోలస్​, అరుణ శ్రీ వంటి వాళ్లు ఉన్నారు.

ఏడాదికి 20 కోట్లపైనే ఖర్చు 

ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నవారికి స్పెషల్​గా ఆఫీస్​ సౌకర్యం కల్పించడంతో పాటు వెహికల్,  ముగ్గురు స్టాఫ్, ఇతర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం 
భరిస్తున్నది. ఒక్కొక్కరికి జీతాలు రూ. 2 లక్షలపైనే ఉన్నట్లు తెలిసింది. ఇలా జీతాలు, ఇతర అవసరాలకు కలిపి నెలకు రూ. కోటిన్న రపైనే ఖర్చు అవుతుండగా.. ఏడాదికి దాదాపు రూ.20 కోట్లు  దాటుతున్నది.