రెహ్మత్నగర్ అభివృద్ధి నా బాధ్యత.. మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ

రెహ్మత్నగర్ అభివృద్ధి నా బాధ్యత.. మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ
  • జూబ్లీహిల్స్​ నియోజకర్గంలో పర్యటన

హైదరాబాద్​ సిటీ, వెలుగు: రెహ్మత్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాధ్యత తీసుకుంటానని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి కోరారు. జూబ్లీహిల్స్  రెహ్మత్​నగర్ డివిజన్​లో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమర భేరీ కార్యక్రమానికి జనసమీకరణ చేశారు. ఈ సందర్భంగా రహ్మత్​ నగర్​కు వచ్చిన మంత్రి వివేక్​కు స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్​ వెంకటస్వామి కార్యకర్తలతో కలిసిపోయారు. వారితో మాట్లాడుతూ.. బైక్​పై పర్యటిస్తూ జన సమీకరణ చేశారు. కార్యకర్తలతో చాయ్​ తాగి.. ఎల్బీ స్టేడియానికి వెళ్తున్న బస్సుకు పచ్చ జెండా ఊపారు. అంతకు ముందు ఆయన స్థానికులతో మాట్లాడారు. 

రహ్మత్ నగర్ అభివృద్ధి తన బాధ్యత అని.. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను గాడిలో పెడతానన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తీసుకొచ్చి డివిజన్​ను డెవలప్​చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెరవేరుస్తున్నామన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పారు.