
అలంపూర్, వెలుగు: అలంపూర్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.45 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున మంజూరు చేస్తూ మంగళవారం హైదరాబాద్లోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రోసిడింగ్ పత్రాలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు అందజేశారు. రాష్ట్ర టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇస్మాయిల్, మహేశ్ గౌడ్ ఉన్నారు.