- రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
సిరికొండ,వెలుగు:కార్యకర్తలు లీడర్లు సైనికుల్లా పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు.మండలంలోని బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సండ్ర శంకర్, బీఆర్ఎస్ గడ్కోల్ గ్రామశాఖ అధ్యక్షుడు, సొసైటీ డైరెక్టర్ వేల్పూర్ గంగారెడ్డి, చిన్నవాల్గోట్ గ్రామశాఖ అధ్యక్షుడు దడివే గణేష్తో పాటు లీడర్లు ప్రసాద్, గంగారెడ్డి, రమణగౌడ్, రాజరెడ్డి, భాస్కర్ రెడ్డి, హరిదాస్, బొర్రయ్య, కాగ్రెస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే పార్టీ కండువ కప్పి లీడర్లను ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్దిని చూసి పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన అని అన్నారు.కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, లీడర్లు కామారెడ్డి సంతోష్ రెడ్డి, గొల్ల లింబన్న, భానుచందర్, గంగారెడ్డి కోచర్, రమేష్ రెడ్డి హేమంత్, తదితరులు ఉన్నారు.
