ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివరాలు చెప్పలేం.. అది చట్ట విరుద్దం : ఎస్బీఐ

ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివరాలు చెప్పలేం.. అది చట్ట విరుద్దం : ఎస్బీఐ

ఎల‌క్టోర‌ల్ బాండ్లతో ఏ పార్టీకి ఎన్ని విరాలలు ఇచ్చారో చెప్పాలని ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఓ వ్యక్తి ఎస్బీఐను కొరాడు. ఇందుకు ఎస్బీఐ బ్యాంకు స్పందిస్తూ అలా చెప్పడం చట్ట విరుద్ధమని బదులిచ్చింది. లోకేశ్ బ‌త్రా అనే వ్యక్తి ఈసీకి స‌మ‌ర్పించిన వివ‌రాల‌కు చెందిన డిజిట‌ల్ డేటాను ఇవ్వాల‌ని ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఎస్బీఐకు దరఖాస్తు పెట్టుకున్నాడు. 

దరఖాస్తుకు స్పందించిన బ్యాంకుఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల అంశాల‌ను ఆర్టీఐ చ‌ట్టం ప్రకారం వెల్లడించ‌బోమ‌ని తెలిపింది. ఆర్టీఐ చ‌ట్టంలోని సెక్షన్‌8(1)(ఈ), సెక్షన్ 8(1)(జే) ప్రకారం విశ్వస‌నీయ‌, వ్యక్తిగ‌త స‌మాచారాన్ని బ‌హిర్గతం చేయ‌బోమ‌ని బ్యాంకు తెలిపింది. ఎల‌క్టోర‌ల్ బాండ్లు కొన్నవారి, రాజ‌కీయ పార్టీల స‌మాచారాన్ని వెల్లడించ‌డం ఆ చ‌ట్టాల ప్రకారం నేరం అవుతుంద‌ని ఎస్బీఐ తెలిపింది.