నవంబర్ 1 నుంచి కేరళలో స్కూల్స్ ఓపెన్

V6 Velugu Posted on Sep 22, 2021

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో విద్యా సంస్థల పునః ప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల ఉక్కిరి బిక్కిరి నుండి దేశమంతా ఊరట పొందుతుంటే.. ఇప్పటికీ బెంబేలెత్తుతూనే ఉన్న కేరళలో కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. తాజాగా 20వేల దిగువకు కేసులు నమోదు అవుతుండడంతో భయానక పరిస్థితులు తొలగినట్లే నని భావిస్తున్నారు. నెల రోజుల్లో అంతా సర్దుబాటు అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. 
ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. వీలును బట్టి ఒకటో తరగతి నుంచి అన్ని స్థాయిల్లో విద్యా సంస్తలు ప్రారంభించాలని, అప్పటికీ అదుపులోకి రాని ప్రాంతాలుంటే నవంబర్‌ 15 నుంచి పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 
 

Tagged kerala, Thiruvananthapuram, Kerala govt, Kerala CM, kerala schools, , kerala updates, kerala education institutes

Latest Videos

Subscribe Now

More News