గోల్డ్‌‌లో డబ్బులు పెట్టడం మంచి దేనా..?

గోల్డ్‌‌లో డబ్బులు పెట్టడం మంచి దేనా..?

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, జియో పొలిటికల్ టెన్షన్లతో గ్లోబల్‌‌గా షేరు మార్కెట్‌‌లు పడుతున్నాయి. గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్‌‌లో ఇన్వెస్ట్‌‌మెంట్‌‌లు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్‌‌లో డబ్బులు పెట్టడం మంచి ఆలోచనే అయినప్పటికీ, ఎటువంటి టైప్ గోల్డ్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌లు చేయాలనేది ఆలోచించాల్సిన అంశం. డిజిటల్‌‌ గోల్డ్‌‌లో ఇన్వెస్ట్ చేయడం, ఫిజికల్‌‌గా గోల్డ్‌‌ జ్యూవెలరీ, కాయిన్స్‌‌, బార్లను కొనడం కంటే  సావరిన్‌‌ గోల్డ్‌‌ బాండ్లు (ఎస్‌‌జీబీ), గోల్డ్‌‌ ఎక్స్చేంజ్‌‌ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌‌లు), మ్యూచువల్​ఫండ్‌‌ల వైపు ఇన్వెస్టర్లు చూడాలని ఎక్స్‌‌పర్టులు సలహా ఇస్తున్నారు.

రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన  ఫిజికల్‌‌ గోల్డ్‌‌ లేదా డిజిటల్‌‌ గోల్డ్‌‌ కొంటే 3 శాతం జీఎస్‌‌టీని, ఒక శాతం టీడీఎస్‌‌ను  కట్టాలి. అలానే కమీషన్ల కింద మరో 2 శాతం వరకు  చెల్లించాలి. ట్యాక్స్‌‌ల కిందనే కొంత డబ్బులు నష్టపోతాం.  ఇంక ఫిజికల్‌‌ గోల్డ్‌‌ లేదా డిజిటల్‌‌ గోల్డ్‌‌ను అమ్మితే  వచ్చే లాభాలపై 20 % లాంగ్‌‌ టెర్మ్ క్యాపిటల్ గె యిన్ ట్యాక్స్ , అదనంగా 4 % సెస్ పడుతుంది.  ఇన్వెస్ట్‌‌మెంట్లను మూడేళ్ల తర్వాత అమ్మితే వచ్చే లాభాలపై లాంగ్‌‌టెర్మ్ క్యాపిటల్‌‌ గెయిన్ ట్యాక్స్ వేస్తారన్న విషయం తెలిసిందే. 
సావరిన్‌ బాండ్లలో పెట్టుబడులు..
గోల్డ్ సావరిన్ బాండ్లను ఆర్‌‌‌‌బీఐ ఇష్యూ చేస్తోంది. ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. ఏడాదికి 2.5 % వడ్డీ కూడా వస్తుంది. ఇంకా ఈ బాండ్లను మెచ్యూరిటీ (ఎనిమిదేళ్లు) వరకు ఉంచితే లాభాలపై క్యాపిటల్‌‌ గెయిన్ ట్యాక్స్ ఉండదు. ఎస్‌‌జీబీల నుంచి ఐదేళ్ల తర్వాత ఎగ్జిట్ అవ్వొచ్చు. కానీ, లాభాల్లో 20 % క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్  కట్టాల్సి ఉంటుంది.  ఎస్‌‌జీబీలు ఎక్స్చేంజిల్లో ట్రేడవుతాయి. ఒకవేళ మూడేళ్లలోపు ఈ బాండ్లను అమ్మితే వచ్చే లాభాన్ని ఇన్వెస్టర్ ఆదాయానికి యాడ్ చేస్తారు. దీనిపై ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్ చట్టం ప్రకారం ట్యాక్స్ పడుతుంది. 
గోల్డ్ ఈటీఎఫ్‌‌లు కూడా మార్కెట్‌‌లో ట్రేడవుతాయి. వీటిపై కూడా లాంగ్‌‌ టెర్మ్ క్యాపిటల్‌‌ గెయిన్ ట్యాక్స్ పడుతుంది.  గోల్డ్ ఈటీఎఫ్‌‌లు, మ్యూచువల్ ఫండ్‌‌లలోని ఇన్వెస్ట్‌‌మెంట్లపై వచ్చే లాభాలను ఇన్‌‌ఫ్లేషన్‌‌కు అడ్జెస్ట్ చేసి ట్యాక్స్ వేస్తారు. అంటే మన గోల్డ్ ఇన్వెస్ట్‌‌మెంట్ వాల్యూ ఏడాదికి 12% పెరిగిందనుకుంటే, ఆ ఏడాది ఇన్‌‌ఫ్లేషన్ 8%  అయితే, కేవలం 4 % లాభంపైనే ట్యాక్స్ వేస్తారు. గోల్డ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్లపై జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ కూడా ఇలాంటి సలహానే ఇన్వెస్టర్లకు ఇస్తున్నారు. ‘ప్రతీ ఒక్కరూ డిజిటల్‌‌ గోల్డ్‌‌ను అమ్ముతున్నట్టు కనిపిస్తోంది. డిజిటల్‌‌ గోల్డ్‌‌పై ఇన్వెస్టర్‌‌‌‌ జీఎస్‌‌టీ కింద 3 %, కమీషన్స్‌‌ కింద 2 % వరకు నష్టపోతారు. వెంటనే కొని, అమ్మితే ఇన్వెస్టర్‌‌‌‌కు 5 % నష్టం వస్తుంది. గోల్డ్‌‌ను ఇన్వెస్ట్‌‌మెంట్‌‌గా చూస్తే మాత్రం సావరిన్‌‌ గోల్డ్‌‌ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌‌లు లేదా మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌ మంచి ఆప్షన్‌’ అని నితిన్ అన్నారు. 

 

ఇవి కూడా చదవండి

జీతాల్లేక కాంట్రాక్టు ఉద్యోగులు తిప్పలు

అసైన్డ్ భూములను గుంజుకున్నరు..ఉనికిచెర్లలో 118 ఎకరాలు తీసుకున్న ‘కుడా’

పార్టీలకతీతంగా రాజీనామాలకు సర్పంచులు రెడీ