బిలియనీర్ల క్లబ్‌లోకి షారుఖ్: ఈసారి కూడా టాప్లో ముకేశ్ అంబానీ.. పెరుగుతున్న కోటీశ్వరులు..

 బిలియనీర్ల క్లబ్‌లోకి షారుఖ్: ఈసారి కూడా టాప్లో ముకేశ్ అంబానీ.. పెరుగుతున్న కోటీశ్వరులు..

M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, ముఖేష్ అంబానీ కుటుంబం ఈసారి కూడా భారతదేశంలోనే అత్యంత ధనవంతులుగా నిలిచింది. వీరి మొత్తం సంపద దాదాపు రూ. 9.55 లక్షల కోట్లు. ముఖేష్ అంబానీ తరువాత గౌతమ్ అదానీ కుటుంబం దాదాపు రూ. 8.15 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉంది. దీనిని బట్టి భారతదేశంలో అత్యంత సంపన్నుల మధ్య గట్టి పోటీ సూచిస్తుంది.

భారతదేశంలో అత్యంత ధనవంతురాలు:
రోష్ని నాడర్ మల్హోత్రా కుటుంబం తొలిసారిగా మూడో స్థానానికి  వచ్చింది. దాదాపు రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో ఆమె ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. భారతదేశ సంపద విషయంలో కొత్త వ్యక్తులు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలు పెరగడం స్ఫూర్తినిస్తోందని ఈ రిపోర్ట్  చెబుతోంది. 

పెరుగుతున్న బిలియనీర్లు:
భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం బిలియనీర్ల సంఖ్య 350 దాటింది. అంటే 13 ఏళ్ల క్రితం ఈ లిస్ట్ మొదలైనప్పటి నుండి ఆరు రెట్లు ఎక్కువ. వీరి మొత్తం సంపద రూ. 167 లక్షల కోట్లు, అంటే భారతదేశ జీడీపీలో దాదాపు సగం. యువ సంపద సృష్టికర్తలు కూడా ముందుకొస్తున్నారు. 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ (పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు) రూ. 21,190 కోట్ల సంపదతో భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యారు.

ALSO READ : టెన్షన్ లేకుండా సేఫ్‌గా రూ.90 లక్షలు కావాలా..? 

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా తొలిసారిగా రూ.12,490 కోట్ల సంపదతో బిలియనీర్ల క్లబ్‌లో చేరారు.  నీరజ్ బజాజ్ కుటుంబం సంపద విషయంలో అతిపెద్ద వృద్ధిని సాధించింది, రూ.69,875 కోట్లు పెరుగుదలతో  మొత్తం రూ.2.33 లక్షల కోట్లకు చేరుకుంది.

ముంబైలో బిలియనీర్లు: బిలియనీర్ల సంఖ్యలో ముంబై 451 మందితో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూఢిల్లీ (223), బెంగళూరు (116) ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఫార్మాస్యూటికల్స్ (మందుల తయారీ) 137 ఎంట్రీలతో మొదటి స్థానంలో ఉంది. పారిశ్రామిక ఉత్పత్తులు (132), రసాయనాలు & పెట్రోకెమికల్స్ (125) తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఈ లిస్టులో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య కూడా పెరిగింది. 2025లో 101 మంది మహిళలు ఉన్నారు, వీరిలో 26 మంది డాలర్ బిలియనీర్లు.