ప్లీజ్.. సాయం చేయండి ఐఎంఎఫ్​ చీఫ్​తో పాక్​ ప్రధాని 

ప్లీజ్.. సాయం చేయండి ఐఎంఎఫ్​ చీఫ్​తో పాక్​ ప్రధాని 

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతుండటంతో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివాతో ఫోన్​లో మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితిని వివరించి.. మరో విడత సాయం విడుదల చేయాల్సిందిగా కోరారు. ఐఎంఎఫ్ ​చీఫ్ నుంచి ఫోన్ వచ్చినట్టు ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ ప్రకటించారు.

ఆర్థిక సాయంపై ఐఎంఎఫ్​ సానుకూలంగా స్పందించిందని వివరించారు. ‘‘మా ప్రజలపై మరింత భారం మోపలేను అని ఐఎంఎఫ్ చీఫ్​కు చెప్పా. ఆర్థిక సాయంపై చర్చల కోసం ఐఎంఎఫ్ ప్రతినిధి బృందాన్ని పాక్​కు పంపాలని కూడా కోరా” అని షెహబాజ్​ చెప్పారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో ఐఎంఎఫ్​ బృందం వస్తుందని, రుణ సాయంతో పాటు ఇతర సమస్యలపైనా చర్చిస్తామని వివరించారు.