వల్లభాయ్ ప‌‌టేల్ ఆశ‌‌య‌‌ సాధ‌‌నకు కృషి చేయాలి : ఎంపీ డీకే అరుణ

వల్లభాయ్ ప‌‌టేల్ ఆశ‌‌య‌‌ సాధ‌‌నకు కృషి చేయాలి : ఎంపీ డీకే అరుణ

ఎంపీ డీకే అరుణ    

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : దేశ‌‌ స‌‌మైక్యత కోసం పోరాడిన మ‌‌హ‌‌నీయుడు, ఉక్కుమ‌‌నిషి సర్దార్ వల్లభాయ్ ప‌‌టేల్ ఆశ‌‌య‌‌సాధ‌‌నకు కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. సోమవారం మహబూబ్ నగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వల్లభాయ్ పటేల్ 150వ జ‌‌యంతిని అధికారికంగా నిర్వహించాల‌‌ని కేంద్ర ప్రభుత్వం కీల‌‌క నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

ఏక్ భార‌‌త్ ఆత్మనిర్బర్ భార‌‌త్‌‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 31న స‌‌ర్దార్ ప‌‌టేల్ విగ్రహాల‌‌కు నివాళులర్పించడంతోపాటు స‌‌ర్దార్‌‌@150 యూనిటీ మార్చ్‌‌ పేరుతో 8 కిలోమీట‌‌ర్ల పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో  31 నుంచి న‌‌వంబ‌‌ర్ 25 వరకు నిర్వహించే ఎక్తా యాత్రలో ప్రజలంద‌‌రూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం  బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మై భార‌‌త్ కేంద్రం ఇన్​చార్జి కోటానాయ‌‌క్‌‌, ప్రోగ్రామ్‌‌ జిల్లా కో–ఆర్డినేట‌‌ర్లతో కలిసి యూనిటీ మార్చ్ పోస్టర్ రిలీజ్ చేశారు.