Cricket World Cup 2023: దక్షిణాఫ్రికా పెను విధ్వంసం.. బంగ్లా ముందు భారీ టార్గెట్

Cricket World Cup 2023: దక్షిణాఫ్రికా పెను విధ్వంసం.. బంగ్లా ముందు భారీ టార్గెట్

వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా విధ్వంసం ఆగట్లేదు. ప్రత్యర్థి ఎవరైనా సఫారీల బ్యాటింగ్ ముందు నిలవలేకపోతున్నారు. ఒక్క నెదర్లాండ్స్ ను మినహాయిస్తే శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పై భారీ స్కోర్ నమోదు చేశారు. 300 పరుగులను అలవోకగా కొట్టేస్తూ సగం మ్యాచ్ తర్వాత తమ విజయాన్ని ఖరారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పై జరుగుతున్న మ్యాచ్ లో కూడా అస్సలు తగ్గని దక్షిణాఫ్రికా.. ఈ టోర్నీలో మరోసారి 300 మార్క్ ను అలవోకగా దాటేసింది. 

ముంబైలోని వాంఖడేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 140 బంతుల్లోనే 174 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్ ఇన్నింగ్స్ లో 7 సిక్సులు 15 ఫోర్లు ఉన్నాయి. 36 పరుగులకే 2 వికెట్లను కోల్పోయినా.. కెప్టెన్ మార్కరం తో కలిసి డికాక్ ఎటాకింగ్ గేమ్ ఆడాడు. మూడో వికెట్ కు 131 పరుగులు జోడించిన తర్వాత మార్కరం 60 పరుగులు చేసి ఔటయ్యాడు.

Also Read: ఇండియన్ టూరిస్టులకోసం.. శ్రీలంక ఫ్రీ వీసా

ఇక ఆ తర్వాత క్లాసన్, డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు.బంగ్లా బౌలర్లను ఊచ కొత్త కోస్తూ బౌండరీల వర్షం కురిపించారు. డికాక్ ఔటైన మిల్లర్ తో కలిసి క్లాసన్ దక్షిణాఫ్రికా స్కోర్ బోర్డును 350 పరుగులు దాటించాడు. క్లాసన్ 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 49 బంతుల్లోనే 90 పరుగులు చేస్తే.. మిల్లర్ 15 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ తో 34 పరుగులు చేసాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమ్మద్ రెండు వికెట్లు తీసుకోగా.. షకీబ్, షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హాసన్ మిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు.