
- ఆవిష్కరించిన సౌత్ ఇండియా రైస్ మిల్లింగ్ అసోసియేషన్
జూబ్లీహిల్స్, వెలుగు: అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన రైస్ మిల్లింగ్ యంత్ర నమూనాను సౌత్ ఇండియా రైస్ మిల్లింగ్ అసోసియేషన్ శనివారం ఆవిష్కరించింది. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, చైర్మన్ జితేందర్, ఏపీఐటి మిషనరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈవో శశి కుమార్ పాల్గొన్నారు. శశి కుమార్ మాట్లాడుతూ.. ఈ యంత్రం ఏఐ టెక్నాలజీతో నాణ్యతలో రాజీ లేకుండా ధాన్యాన్ని ఎండబెట్టడం, పొట్టు తొలగించడం, ఆరబెట్టడం వంటి పనులను కచ్చితంగా చేస్తుందన్నారు.
ఈ యంత్రం బియ్యం పొట్టు, కట్టెలను ఇంధనంగా ఉపయోగించి తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని దేవేందర్ రెడ్డి తెలిపారు. వివిధ రకాల ధాన్యాన్ని నిర్ణీత సైజులలో వేగంగా మిల్లింగ్ చేస్తుందని వివరించారు.