అలంపూర్, వెలుగు : ప్రతిఒక్కరూ చట్టపరంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి గ్రామాల్లో మూడో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎర్రవల్లి పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సూచించారు.
ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ అని, ప్రజలు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరి రోజు కావడంతో ఎవరి మీద ఒత్తిడి చేయొద్దని చెప్పారు. అభ్యర్థులు లేదా వారి కుటుంబ సభ్యులను ఎవరైనా బెదిరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
