ఉమామహేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న శ్రీశైలం ఆలయ కమిటీ చైర్మన్

ఉమామహేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న  శ్రీశైలం ఆలయ కమిటీ చైర్మన్

అచ్చంపేట, వెలుగు : ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయాన్ని శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేశ్ నాయుడు దర్శించుకున్నారు. ఉమామహేశ్వర దర్శనానికి వచ్చిన రమేశ్ నాయుడుకి ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావుతోపాటు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. నల్లమల్ల ప్రాంతంలోని ఉమామహేశ్వర క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుందని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీశైలం చైర్మన్ రమేశ్ నాయుడును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.