V6 News

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి : మంత్రి వాకిటి శ్రీహరి

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి : మంత్రి వాకిటి శ్రీహరి
  • రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి 

జడ్చర్ల టౌన్, వెలుగు: కాంగ్రెస్​బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. జడ్చర్లలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో క్రీడా శాఖకు రూ.26 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 

2036 ఒలింపిక్స్ లో పతకాల సాధనే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అందుకు తగ్గట్టుగా క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి నాయకత్వంలో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు.