అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లిస్తాం : కోమటిరెడ్డి నరేందర్రెడ్డి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లిస్తాం : కోమటిరెడ్డి నరేందర్రెడ్డి
  • సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్​రెడ్డి

కొత్తపల్లి, వెలుగు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి లక్ష్మీనరసింహకాలనీలోని మహమ్మద్‌‌‌‌ అబ్దుల్లాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన చెందొద్దని, వచ్చే విడతల్లో అవకాశం వస్తుందన్నారు.

 గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. భూమి లేని నిరుపేదలకు గాంధీనగర్‌‌‌‌‌‌‌‌లోని డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తిచేసి ఇస్తామన్నారు. కార్యక్రమంలో లీడర్లు అస్తపురం రమేశ్, ఎండీ చాంద్, లత, తిరుమల, శ్రీనివాస్​రెడ్డి, మల్లేశం, లత, నర్సింగం, శ్రీనివాస్, రాజయ్య పాల్గొన్నారు.