తాడ్వాయి, వెలుగు: విద్యార్థులు విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తాడ్వాయి నరేష్ అన్నారు. ఆయన గురువారం తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి హై స్కూల్ విద్యార్థులకు కళాజాతర బృందంతో బాల్యవివాహాలు, ప్రేమలు, మోసాలు, సైబర్ నేరాలు, మారకద్రవ్యాలు, తదితర అంశాలు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు బాల్యవిహాలు చేసుకోవద్దని, ప్రేమ పేరుతో మోసపోవద్దని, అబ్బాయిలు మారక ద్రవ్యాలకు,గుట్కా, గంజాయి సిగరెట్టు లాంటి చెడలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
చిన్నతనం నుంచి విద్యార్థులు ఆటలు ,చదువులపై దృష్టి పెట్టాలని వాటివల్ల భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. కార్యక్రమంలో కళాబృందం ఇంచార్జి హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, శేషారావు, ప్రభాకర్, సాయిలు, ఎంఈఓ రామస్వామి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
