రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద టీచర్ల ధర్నాలు  

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద టీచర్ల ధర్నాలు  

 

  • రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద టీచర్ల ధర్నాలు  
  • ఆదిలాబాద్‌‌లో మహిళా టీచర్ల కంటతడి 
  • టీచర్లకు కోదండరాం, తదితర నేతల సంఘీభావం 

వెలుగు నెట్ వర్క్: జీవో 317లోని లోపాలను సరిదిద్దాల్సిందేనని టీచర్లు డిమాండ్ చేశారు. జీవోను సవరించాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌తో శనివారం టీచర్ యూనియన్ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఆందోళనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోను సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లీడర్లు డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో టీచర్లు భారీ నిరసన సభలు నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జీవో 317తో అన్యాయం జరుగుతోందని మహిళా టీచర్లు కంటతడి పెట్టారు. జిల్లాల అలకేషన్‌‌‌‌‌‌‌‌లో స్థానికత కోల్పోయిన టీచర్లను ఆప్షన్ ప్రకారం వారి సొంత జిల్లాలకు పంపించాలని కోరారు.  

స్పౌజ్ అప్పీల్స్ పరిష్కరించాలె.. 

స్పౌజ్ కేటగిరీ అప్పీల్స్‌‌‌‌ను వెంటనే పరిష్కరించాలని, హోల్డ్ లో ఉంచిన 13 జిల్లాల స్పౌజ్ అప్పీల్స్ ను ఖాళీల మేరకు అనుమతించాలని టీచర్లు డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్​కలెక్టరేట్ల వద్ద కూడా టీచర్లు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వనపర్తి ఎంపీడీవో ఆఫీసు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీచర్లకు వివిధ పార్టీల లీడర్లు మద్దతు ప్రకటించారు. జీవో 317తో టీచర్లకు ఏర్పడిన ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట హనుమకొండ, వరంగల్ జిల్లాల టీచర్లు ధర్నా చేశారు. మహబూబాబాద్, ములుగు, కామారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం జిల్లాల్లోనూ టీచర్లు ఆందోళనలు చేపట్టారు.   

టీచర్ల ఇబ్బందులను తొలగించాలె: కోదండరాం  

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్​ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు టీచర్ యూనియన్​ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ హాజరై సంఘీభావం తెలిపారు. స్థానికత విషయంలో టీచర్ల ఇబ్బందులను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోదండరామ్‌‌ డిమాండ్ చేశారు. మెదక్​ కలెక్టరేట్ వద్ద టీచర్స్ యూనియన్​ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 317 జీవోలోని లోపాలను సవరించాలని డిమాండ్​ చేస్తూ అడిషనల్ కలెక్టర్ రమేశ్‌‌​కు మెమోరాండం అందజేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కూడా టీచర్లు ధర్నా చేశారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టరేట్ల​ ఎదుట ధర్నాలు చేపట్టారు. కరీంనగర్​లో జరిగిన ఆందోళనకు డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సంఘీభావం తెలిపారు.