ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని.. 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్య

ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని.. 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్య

పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ర్టలో జరిగింది. థానే నగరంలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో నివసించే ఉత్తేకర్ అనే 24 ఏళ్ల వ్యక్తి... కొన్ని రోజుల క్రితం మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. 

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉత్తేకర్ పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. తనపై కేసులు పెట్టొద్దని ఎంత వేడుకున్నా పోలీసులు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో కొన్నిరోజుల నుంచి మనస్తాపంతో కుమిలిపోతున్నాడు. ఇదే క్రమంలో పోలీసులు తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు ఉత్తేకర్. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల తీరుపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.