
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలోని ప్రైవేట్ పాఠశాలను గురువారం ఎంఈవో కత్తుల అరుంధతి ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ తనిఖీ చేసింది. నల్గొండలోని ఎస్ పీఆర్ స్కూల్, గొల్లగూడలోని అరోరా స్కూల్, పానగల్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ రోడ్డులోని కాకతీయ స్కూల్, జయ స్కూళ్లను అధికారులు తనిఖీలు చేశారు. రిపోర్టును డీఈవో భిక్షపతికి అందజేసినట్లు ఎంఈవో తెలిపారు.