కోడిపుంజుకు టికెట్​ కొట్టిన కండక్టర్

కోడిపుంజుకు టికెట్​ కొట్టిన కండక్టర్
  • పాత చీరలో చుట్టి ఎక్కిన ప్యాసింజర్​
     
  • సగం దూరం పోయినంక కొక్కోరోకో అన్న కోడి
  • రూ.30 టికెట్  ఇచ్చిన కండక్టర్​
  • మెమో ఇస్తామన్న డీఎం

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆర్టీసీ కండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ కోడి పుంజుకు టికెట్ ​ కొట్టాడు. మంగళవారం ఖని నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సులో మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ అనే ప్యాసింజర్​ కోడిపుంజును పాత చీరలో చుట్టుకుని ఎక్కాడు. దీన్ని కండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరుపతి గమనించలేదు. కేవలం ఆలీకి మాత్రమే కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు టికెట్ ​ఇచ్చాడు. సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకున్న తర్వాత కోడిపుంజు కొక్కోరోకో అని ఒర్రుడు స్టార్ట్​ చేసింది. కండక్టర్ ​వెళ్లి చూడగా పుంజు కనిపించింది. దీంతో కోళ్లు, మేకలు, గొర్రెలు బస్సులో తీసుకువెళ్లడానికి వీలు లేదని చెప్పాడు. సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు రూ.30 అవుతుందని, టికెట్ ​తీసి అలీ చేతిలో పెట్టాడు. దీంతో అతడు టికెట్​ డబ్బులు కట్టి పుంజును తీసుకువెళ్లాడు. కండక్టర్ మాట్లాడుతూ ప్రయాణికులతో పాటు ఏ జంతువును తీసుకువచ్చినా  టికెట్ ​తీసుకుంటామన్నాడు. దీనిపై గోదావరిఖని డీఎం వెంకటేశం మాట్లాడుతూ పుంజుతో  బస్సు ఎక్కేటప్పుడే గుర్తించాలని, టికెట్ ​తీసుకోవడం కరెక్ట్​ కాదని, కండక్టర్​కు మెమో ఇస్తామన్నారు.